ఈ ఏడాదిలోనే 17 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య.. అసలేం జరుగుతోంది అక్కడ?
చదువు ఒత్తిడి తట్టుకోలేక, ర్యాంకులు రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగిపోతున్నాయి. చదువు అంటూ పుస్తకాలు బట్టీ పడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరగడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే అక్కడ మాత్రం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 17 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఇంతకీ ఈ ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి. అంత మంది విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ప్రధానాంశాలు:
- విద్యార్థుల ఆత్మహత్యలతో కలకలం
- ఈ ఏడాదిలోనే అక్కడ 17 మంది సూసైడ్
- ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన
- రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుసగా సూసైడ్ చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారుతోంది. అక్కడ రెండు, మూడు వారాలకో విద్యార్థి ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా కలవర పెడుతోంది. అయితే తాజాగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ కోసం సిద్ధం అవుతున్న విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో మొత్తం 17 మంది ఆత్మహత్యలకు పాల్పడటం ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులతోపాటు అక్కడి కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
0 Comments