బెంగళూరు శివారులోని బిదనూరుకు చెందిన మంజునాథ్ అనే వ్య‌క్తికి ఇద్ద‌రు కుమార్తెలు. ఇటీవ‌ల ఆయ‌న చిన్న కుమార్తె ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. తాజాగా పెద్ద కూతురు క‌వ‌న‌(20) 'నేనూ ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా నాన్న' అని చెప్పింది. క‌వ‌న వేరే సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని ప్రేమించ‌డంతో.. వారిద్ద‌రీ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆగ్ర‌హానికి గురైన మంజునాథ్ పరువు పోయిందంటూ కవనను క‌ట్టెతో త‌ల‌పై కొట్టి, గొంతు కోసి చంపాడు.