విజయవాడ: యువతిని బెదిరించిన కేసులో నిందితుడు అరెస్ట్
అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా యువతిని కత్తితో బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిపై విజయవాడ దిశ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వించిపేటలో నివసించే యువతి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు నాగరాజు అనే యువకుడు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వెంట పడి వేధించాడు. వెంటనే దిశ ఎసీఎస్ కు కాల్ చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

0 Comments