ప్రధానాంశాలు:
- మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్
- వీడియోపై సమాధానం ఇచ్చిన పోలీసులు
- నిబంధనల ప్రకారమే చేశామని వెల్లడి
Woman Dragged: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ మహిళ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అక్కడే ఒక బుల్డోజర్, అధికారులు, పోలీసులు ఉన్నారు. అయితే అందులోని ఇద్దరు పోలీసులు.. మహిళ జట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగినట్లు తెలిసింది. మహిళను జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం పట్ల మధ్యప్రదేశ్ పోలీసులు స్పందించారు. అయితే వారి ఇచ్చిన సమాధానంతో మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ఆ వీడియోపైనే విమర్శలు కురుస్తున్న వేళ.. పోలీసుల సమాధానం మరింత విచిత్రంగా ఉండటం గమనార్హం.
మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లా కౌరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. తన పొలంలో విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు రాగా ఓ మహిళ అడ్డుకుంది. తన భూమిలో కరెంటు స్తంభం వేసినందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదని వాపోయింది. దీనికి నిరసనగా ఇక్కడే కూర్చొని నిరస వ్యక్తం చేసింది. తన స్థలంలో స్తంభం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకుంది. ఈ క్రమంలోనే అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అధికారులు పోలీసులను అక్కడికి రప్పించారు. ఆందోళన చేస్తున్న మహిళను మహిళా పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే మహిళ కింద కూర్చొని ఉండగా.. ఆమె జుట్టును పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
0 Comments