మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది అనడానికి నిదర్శమే ఈ సంఘటన. ఆకలితో ఉన్న చంటి బిడ్డకు పాలు కావాలని అడిగితే ఓ మహిళ పట్ల కొందరు వ్యక్తులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఆమెను ఈడ్చుకెళ్లి, తన్నుతూ, కొడుతూ చిత్ర హింసలు చూపించారు. అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వదల కుండా చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది కాస్త పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అత్యంత దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.