పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో తీవ్ర విషాద చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబంలోని ముగ్గురు ఆడ పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. రోజూలాగే పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికి వచ్చి చూసే సరికి తమ ముగ్గురు కుమార్తెలు కనిపించలేదు. ఆ చుట్టు పక్కల వెతికిన తర్వాత వారు కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదే ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెలో వారి ముగ్గురు పిల్లలు మృతదేహాలుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ ముగ్గురు పిల్లల తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.