కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు ఇంటిలో లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఏడో నెల గర్బవతి అని కూడా కనీసం మానవత్వం చూపలేదు. ఈ విషయం బయటపెడితే చంపుతానని బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయం గురించి భర్తతో చెప్పుకుంటే ఊరట దక్కుతుందని ఆమె భావించింది. కానీ, భర్త ఆమెనే నిందించాడు. నువ్వు నాకు భార్యవు కావు.. తల్లివంటూ బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రధానాంశాలు:
2005లో సంచలనం రేపిన ఇమ్రానా అత్యాచార ఘటన
మామను భర్తగా స్వీకరించమని పంచాయతీ తీర్పు
బాధితురాలి ఫిర్యాదు వెలుగులోకి వచ్చిన ఘటన
2005లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 28 మహిళ ఇమ్రానా అత్యాచార ఉదంతాన్ని తలపించే మరో ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇమ్రానాపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడితే.. ఆమె భర్తను కొడుకుగా స్వీకరించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తాజాగా, ముజఫర్‌నగర్ జిల్లాలో ఏడో నెల గర్బిణి అయిన కోడలిపై మామ (50) అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జులై 5న ఇంటిలో ఒంటరిగా ఉన్న కోడలిని (23) ఈడ్చుకెళ్లి అత్యాచారం చేసిన నిందితుడు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఈ విషయం గురించి బాధితురాలు తన భర్తకు చెబితే.. కనీసం జాలి చూపలేదు. ఆమెనే కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడు. అంతేకాదు, ఎప్పుడైతే తన తండ్రితో శారీరక సంబంధం ఏర్పడిందో అప్పుడే ఆయనకు భార్య అయ్యావని, మనం ఇక కలిసి ఉండలేమని తెగేసిచెప్పాడు. తన గౌరవాన్ని కాపాడుకోవాలని కొద్ది రోజుల పాటు బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. తాను ఏ తప్పు చేయలేదని భర్తను పదేపదే ప్రాధేయపడినా ఏలుకోడానికి నిరాకరించాడు. దీంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు.
0 Comments